రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష

Mango News, Niranjan Reddy Review on Yasangi Cultivation Plan, Review on Yasangi Cultivation Plan, Singireddy Niranjan Reddy, Singireddy Niranjan Reddy held Review on Yasangi Cultivation Plan, telangana agriculture minister, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy held Review on Yasangi Cultivation Plan, Telangana Yasangi Cultivation Plan, Yasangi Cultivation Plan, Yasangi Cultivation Plan In Telangana

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తులో భాగంగా ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి, వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎంత విస్తీర్ణంలో వేయాలి, మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది అనే అంశాలపై వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సూచనల పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలిపారు.

ఈ తుది నివేదికను రేపు సీఎం కేసీఆర్ కు అందజేయనున్నామని, యాసంగి పంటల ప్రణాళికను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. హాకాభవన్ లో జరిగిన సమీక్షలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటుగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభిృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వీసీ ప్రవీణ్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, విత్తనాభిృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, ప్రిన్స్ పల్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఉన్నతాధికారులు, మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ