తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టబోతే పాదయాత్ర పేరును శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ పాదయాత్రకు “ప్రజా సంగ్రామ యాత్ర” అనే పేరు పెట్టారు. అలాగే ఆగస్టు 24, మంగళవారం నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ముందుగా బీజేపీ శాసనసభ పక్షనేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర బీజేపీ నేతలతో కలిసి శుక్రవారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాదయాత్ర పేరుపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొంటారని రాజాసింగ్ తెలిపారు.
ఆగస్టు 24 ఉదయం హైద్రాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు కొనసాగనుంది. మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర ఆగస్టు 9న ప్రారంభం కావాల్సి ఉండగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమైన బిల్లుల దృష్ట్యా సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడంతో పాదయాత్ర ప్రారంభాన్ని ఆగస్టు 24వ తేదికి వాయిదా వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































