రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు, నైట్ కర్ఫ్యూ దృష్ట్యా తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20, మంగళవారం నుంచి రాష్ట్రంలో సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లను నడపడంపై ఈ రోజు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని థియేటర్లు మూసివేతకే ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు.
మరోవైపు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో నేటి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లను రాత్రి 8 గంటల లోపే మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ