ఇబ్రహీంపట్నం బాధిత మహిళలకు నిమ్స్‌లో మంత్రి హరీష్ రావు పరామర్శ, ఘటనకు కారకులైన వారిపై సస్పెన్షన్

Minister Harish Rao Visited The Affected Women of Ibrahimpatnam in NIMS Hospital Hyderabad, Minister Harish Rao NIMS Hospital Hyderabad, 2 Women Killed in Botched Tubectomy, Botched Tubectomy Kills 2 Women in Govt Hospital, Mango News,Mango News Telugu, Botched Tubectom Gone Wrong In Ibrahimpatnam, Family Planning Operation, Telangana Latest News And Updates, Family Planning Operation In Telangana, Health Minister Harish Rao , Telangana News

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల చోటుచేసుకున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఘటనకు బాధ్యులైన వారిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మంత్రి హరీష్ రావు నిమ్స్‌లో చేర్పించబడిన బాధిత మహిళలను పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన ఆయన ఎలాంటి ఆందోళన చెందవద్దని, దైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, డిశ్చార్జ్ చేశాక వైద్య సిబ్బంది అంబులెన్సుల్లో ఇంటివరకు తీసుకెళ్లి దింపుతారని మంత్రి బాధిత మహిళలకు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఘటనలో నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరం, బాధాకరమని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేసినట్లు తెలిపిన ఆయన ఆ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను కూడా సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కమిటీ వేశామన్న మంత్రి, ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని, దీనిపై సవివర నివదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో 13 మంది, నిమ్స్ ఆస్పత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. గత 6-7 ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఆపరేషన్లు చేసామని, అయితే ఇలాంటి సంఘటన మాత్రం ఎప్పుడూ జరగలేదని హరీష్ రావు గుర్తు చేశారు.

ఇప్పుడున్న వారంతా సేఫ్ గా ఉన్నారని, వారికి ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు వివరించారు. మేము ఘటన తెలిసిన నాటి నుండి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని, ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా అంబులెన్స్ పంపి హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే మా ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడే ఉంటున్నారని, వారిని గంట గంటకు మానిటర్ చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నామని, అలాగే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.అలాగే వారి పిల్లల చదువుల బాధ్యత కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు భరోసానిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twenty =