తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7, సోమవారం నాడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. యాదాద్రి జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పలుమార్లు పర్యటించి, ఎప్పటికప్పుడు సూచనలు జారీచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో పనులను మరోమారు పరిశీలించి సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేసే అవకాశమునట్టు తెలుస్తుంది. అలాగే మహాసుదర్శన యాగం, మార్చి 28వ తేదీన జరిగే మహాకుంభ సంప్రోక్షణ నిర్వహణపై ఆలయ సిబ్బంది, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ