ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు

Mango News, Paddy Procurement, Paddy procurement across Telangana, Paddy Procurement Centers, Paddy procurement issue takes a political turnover, Paddy procurement issue takes a political turnover in Telangana, Paddy Procurement System, Protest Central Stance on Paddy Procurement, telangana, TRS holds dharna across Telangana, TRS Party Holding Dharnas Across Telangana, TRS Party Holding Dharnas Across Telangana to Protest Central Stance on Paddy Procurement, TRS stages protests against Centre’s stand on paddy, TRS to stage protests across Telangana

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 12, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు ప్రారంభమయ్యాయి. ధర్నాల నిర్వహణకు టీఆర్ఎస్ నాయకులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ముందుగానే అనుమతులు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ధర్నా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొనగా, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో ధర్నా కొనసాగుతుంది.

ఇక జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి రాష్ట్ర మంత్రులు ధర్నాలో పాల్గొని, ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద మంత్రి హరీశ్ రావు, మేడ్చల్ బస్ డిపో వద్ద మంత్రి మల్లారెడ్డి, ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌ లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, వేల్పూర్‌ లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =