ఈ నెల 10 న సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

Telangana CM KCR Will Tour in Siddepet District on Decemeber 10th,CM KCR to inaugurate TRS Siddipet office on December 10,CMKCR,TRS,KCR,TRS Siddipet,TRS Siddipet Office,CM KCR To Inaugurate TRS Siddipet Office on December 10,Foundation For It Tower In Siddipet District By CM Kcr On December 10,Telangana CM KCR,Telangana CM KCR Tour,Telangana CM KCR Siddepet Tour,Telangana CM KCR Tour in Siddepet on Decemeber 10th,MAngo News,Mango News Telugu,Telangana CM KCR Tour in Siddepet

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిసెంబర్ 10 వ తేదీన సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం నాడు మీడియాకు వెల్లడించారు.

సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన వివరాలు:

  • సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో రూ.163 కోట్లతో పేద ప్రజల కోసం గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ప్రభుత్వం నిర్మించిన 2,460 డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం ప్రారంభం.
  • సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్ ప్రారంభం.
  • మెడికల్‌ కాలేజ్ కు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన.
  • సిద్ధిపేట చింతల్‌చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభం.
  • రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ వద్ద రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహం ప్రారంభం.
  • మిట్టపల్లి రైతువేదిక, విపంచి ఆడిటోరియం ప్రారంభం.
  • కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన.
  • సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాలలో నిర్మించిన‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్) ప్రారంభం.
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ