రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు: సీఎం కేసీఆర్

TRS Party Extended Support To Farmers Bharat Bandh On December 8th,TRS Extends Support To Protesting Farmers Call For Bharat Bandh On December 8,CM KCR Extends TRS Support To Farmers Bharat Bandh,TRS supports Bharat Bandh on December 8,TRS Supports Bharat Bandh on December 8,Farmers Protest,Farmers In Delhi,Centre,Centre Vs Farmers,Farm Bill,Centre Farm Bill,Haryana Farmers,Farmers In Delhi Protest,Meeting With Farmers,Punjab Farmers Protest,Farm Laws,Mango News,Mango News Telugu,Bharat Bandh,Farmers Bharat Bandh On December 8th

డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని సీఎం కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని సీఎం గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =