తెలంగాణలో భారీ వర్షాలు, ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయొద్దు

CS alerts district collectors in view of heavy rains, CS warning to collectors and SPs on heavy rainfall, Heavy Rains In Telangana, Hyderabad IMD predicts heavy rains, Somesh Kumar, Somesh Kumar Alerts Collectors Over the Heavy Rains, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana gets heavy rainfall

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్ననేపధ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులందరూ హెడ్ క్వార్టర్ లోనే ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాలలో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలు మరియు వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. కురుస్తున్న వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు పంపించాలని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu