రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ ను 100% కోవిడ్ వాక్సినేషన్ నగరంగా చేసేందుకు కసరత్తు

CS Somesh Kumar Meeting with officials on COVID and Other Health Related Matters, Mango News, Somesh Kumar, Somesh Kumar held Meeting with officials on COVID, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Held Meeting, Telangana CS Somesh Kumar held Meeting with officials on COVID and Other Health Related Matters, Telangana CS Somesh Kumar held Review with District Collectors Over Covid-19 Control Measures

రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ ను 100% కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెఛ్ఎంసీ కమీషనర్, జీహెఛ్ఎంసీ పరిధిలో ఉన్న 4 జిల్లాల కలెక్టర్లు, జీహెఛ్ఎంసీ జోనల్ కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు, డీఎంహెఛ్ఓలు, ఎస్పీహెఛ్ఓలతో బీఆర్కేఆర్ భవన్ నందు గురువారం నిర్వహించిన వర్క్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడారు. నగరంలోని అన్ని కాలనీలను 100% వాక్సినేషన్ కాలనీలుగా తీర్చిదిద్ధేందుకు శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లను భాగస్వాములను చేస్తూ, జీహెఛ్ఎంసీ, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయముతో వ్యవహరించాలని సీఎస్ సూచించారు.

ఇంటింటికి తిరిగి సర్వే జరిపి 18 సంవత్సరాల పైబడిన అర్హత కలిగిన వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. ఒక ఉద్యమముగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ వాక్సినేషన్ కు మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో ఇంటింటికి తిరిగి మిగిలి పోయిన వ్యక్తులకు వాక్సినేషన్ చేయుటకు వ్యవస్థాపరమైన సిబ్బంది మరియు మెటీరియల్ తో కాలనీల వారీగా టీమ్ లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హన్మంత రావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, ఓఎస్డి టు సిఎం డా.గంగాధర్, హైదరాబాద్ డీఎంహెఛ్ఓ డాక్టర్ వెంటటి, రంగారెడ్డి డీఎంహెఛ్ఓ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, మేడ్చల్ మల్కాజిగిరి డీఎంహెఛ్ఓ డాక్టర్ మల్లికార్జున్, సంగారెడ్డి డీఎంహెఛ్ఓ డా.గాయత్రి, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ