నాలుగురోజులలో 61752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ : మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana Farmers Loan Waiver: Rs 175.96 Cr Transfer to 61752 Farmers Accounts in 4 Days

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి రెండో విడత రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విడతలో భాగంగా ఆగస్టు 30వ తేదీ వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ నేపథ్యంలో నాలుగో రోజైన ఆగస్టు 19న రుణమాఫీ కింద రూ.39.40 కోట్లను 10,958 మంది రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

అలాగే నాలుగురోజులలో మొత్తం 61,752 మంది రైతులకు రుణమాఫీ కింద రూ.175.96 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రుణాల నుండి రైతులు విముక్తి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షని మంత్రి పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, కరోనా విపత్తులోనూ రైతు శ్రేయస్సు దృష్ట్యా వంద శాతం పంటలు కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ నేతా ఊహించని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మరి ఇన్నేళ్లలో ఏ పార్టీ, ఏ నేతా సమాజంలో ప్రధానమయిన వ్యవసాయ రంగం గురించి ఎందుకు ఆలోచించ లేదు?, అణగారిన వర్గాల సంక్షేమం గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి కుటుంబం వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =