ఆరంఘర్ నుండి ఎయిర్ పోర్టుకు కలిసే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ : సీఎస్

Chief Secretary Reviewed Progress of Haritha Haram, CS Somesh Kumar Inspected Multi Level Avenue Plantation, CS Somesh Kumar Reviews on Progress of Haritha Haram, Hyderabad, Mango News, Multilayer avenue plantation to be taken up in Hyderabad, NHAI plans to take up plantation on airport road, Somesh Kumar, Somesh Kumar directs officials to take up extensive plantation, Telangana CS, Telangana CS Somesh Kumar Participated in HarithaHaram, Telangana CS Somesh Kumar Participated in HarithaHaram and Inspected Multi Level Avenue Plantation

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ), జీహెఛ్ఎంసీ అధికారులతో బిఆర్‌కెఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఆరంఘర్(పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే) నుండి ఎయిర్ పోర్టుకు అనుసంధానించే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారికి ఇరువైపుల పుష్పించే మొక్కలతో మల్టీకలర్/మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ (ఎంఎల్ఏపీ)ను చేపట్టాలని, ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు హరిత అనుభవాన్ని అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జీహెఛ్ఎంసీ అధికారులను ఆదేశించారు.

అంతకుముందు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎస్ మొక్కలు నాటారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై బుద్వేల్ వద్ద జీహెఛ్ఎంసీ ద్వారా చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సమావేశంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ ఛీప్ గణపతి రెడ్డి, ఎన్‌హెచ్ఏఐ అధికారులు, ఎన్ హెఛ్ఏఐ అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారి ఎస్.కె. ఖుష్వా, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ధ‌ర్మారెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ