తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన తుది పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) జనవరి 1న ప్రకటించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. ఎస్సై తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా ఏప్రిల్ 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 23వ తేదీన సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 8న ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు/ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లు జనవరి 5వ తేదీన ముగియనున్నట్టు తెలిపారు. గత 3 వారాలుగా నిర్వహించిన ఈవెంట్లలో అభ్యర్థులు చాలా బాగా రాణిస్తున్నారని పీఎంటీ/పీఈటీలో అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫైనల్/తుది పరీక్షలకు తేదీలు ప్రకటిస్తున్నామని చెప్పారు. హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ సహా ఇతర వివరాలన్నీ నిర్ణీత సమయంలో తెలియజేయబడతాయని పేర్కొన్నారు. అలాగే డ్రైవర్లు, డ్రైవర్ ఆపరేటర్లు మరియు మెకానిక్ల పోస్టులుకు సంబంధించి ట్రేడ్/డ్రైవింగ్ పరీక్షల తేదీలు తగిన సమయంలో తెలియజేయబడతాయన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకై తుది పరీక్షల షెడ్యూల్:
- మార్చి 12 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – ఎస్సై ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్ (సెంటర్)
- మార్చి 12 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – ఏఎస్సై ఫింగర్ ప్రింటింగ్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్
- మార్చి 26 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – ఎస్సై ట్రాన్స్పోర్ట్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్
- ఏప్రిల్ 2 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – కానిస్టేబుల్ డ్రైవర్ ఆపరేటర్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్
- ఏప్రిల్ 2 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – కానిస్టేబుల్ మెకానిక్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్
- ఏప్రిల్ 8 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – ఆల్ ఎస్సై/ఏఎస్సై (సివిల్, ఐటీ, ట్రాన్స్పోర్ట్, ఫింగర్ ప్రింట్) – అర్ధమెటిక్, రీజనింగ్ పరీక్ష – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
- ఏప్రిల్ 8 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – ఆల్ ఎస్సై/ఏఎస్సై (సివిల్, ఐటీ, ట్రాన్స్పోర్ట్, ఫింగర్ ప్రింట్) – ఇంగ్లీషు పరీక్ష – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
- ఏప్రిల్ 9 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – సివిల్ ఎస్సై – జనరల్ స్టడీస్ పరీక్ష- హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
- ఏప్రిల్ 9 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – సివిల్ ఎస్సై – తెలుగు/ఉర్దూ పరీక్ష – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్
- ఏప్రిల్ 23 – ఉదయం 10 గంటలు-1 గంట వరకు – కానిస్టేబుల్ (సివిల్, ట్రాన్స్పోర్ట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్) – జనరల్ స్టడీస్ పరీక్ష – తెలంగాణలోని పాత 10 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో నిర్వహణ
- ఏప్రిల్ 23 – మధ్యాహ్నం 2.30 గంటలు-5.30 గంటల వరకు – కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ – టెక్నికల్ పేపర్ పరీక్ష – హైదరాబాద్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE