ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020 హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ప్రారంభం

Eamcet 2020 Hall Tickets Download, Telangana Eamcet, Telangana EAMCET 2020, Telangana Eamcet 2020 Hall Tickets, Telangana Eamcet Exam, Telangana Eamcet Exam Updates, Telangana Eamcet Hall Tickets, TS Eamcet 2020, TS EAMCET 2020 Admit Card, TS EAMCET 2020 Hall Ticket

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020‌ పరీక్షను సెప్టెంబరు 9,10,11,14 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3, గురువారం నుంచి సెప్టెంబర్‌ 7, సోమవారం వరకు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. హాల్ టికెట్స్ ను www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు మొత్తం 1,43,165 అభ్యర్థులు హాజరు కానుండగా, తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్ లో 23 పరీక్షా కేం‍ద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడడం వంటి విషయాలను కచ్చితంగా ఆచరించాలని కన్వీనర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu