ఈఎస్ఐ కుంభ‌కోణంలో దేవికా రాణి సహా 9 మంది అరెస్ట్

ACB Officials Arrests IMS Ex-Director Devika Rani, ACB Takes ESI Medical Scam Accusers Into Custody, Andhra Pradeesh ESI Scam, Atchannaidu ESI Scam, ESI Medical Scam, ESI Medical Scam Accusers, ESI Medical Scam Latest Updates, ESI Scam, ESI Scam In AP, IMS Ex-Director Devika Rani, IMS Ex-Director Devika Rani arrested

తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించిన కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మందుల కొనుగోళ్ల అక్రమాలలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు మరోసారి అరెస్టు చేశారు. ఆమెతో పాటుగా మరో 8 మందిని అరెస్టు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. తప్పుడు కంపెనీలతో న‌కిలీ బిల్లులు సృష్టించి మందులు, వైద్య కిట్ల‌ను కొనుగోలు చేసిన కేసులో వీరిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కుంభకుణంలో మొత్తం రూ.6.5 కోట్ల అవినీతిని ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో సంబంధమున్న పలువురి ఇళ్లల్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అరెస్ట్ చేసిన వారందరిని కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =