కొడుకుపై కోపం.. నామినేషన్ వేసిన బామ్మ

82 Year Old Grandmother in the Election Race,82 Year Old Grandmother,Grandmother in the Election Race,Mango News,Mango News Telugu,old women, jagityal, nomination, telangana assembly elections,Electoral fraud,82 Year Old Grandmother Latest News,Telangana Politics,82 Year Old Grandmother Latest Updates,82 Year Old Grandmother Live News,Election Race Latest News,Election Race Latest Updates, Telangana Political News And Update
old women, jagityal, nomination, telangana assembly elections,

కన్నకొడుకే ఆ వృద్ధురాలిని ఇంటి నుంచి గెంటేశాడు. ఉన్న చిన్న గూడును కూడా లాక్కొని రోడ్డున పడేశాడు. న్యాయంకోసం ఆ వృద్ధురాలు రాజకీయ నాయకులు, పోలీసులు, కోర్టుల చుట్టూ.. కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడి.. పోరాడి ఆ వృద్ధురాలికి విసుగొచ్చింది. వ్యవస్థలపై కూడా ఆమెకు నమ్మకం పోయింది. ఇలానే ఉంటే.. తనకు న్యాయం జరగదనుకుంది ఆ వృద్ధురాలు. తనలాగే అన్యాయమైపోతున్న ఎంతో మందికి న్యాయం చేయాలని కంకణం కట్టుకుంది. 82 ఏళ్ల వయస్సులో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ వృద్దురాలు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

జగిత్యాల జిల్లాకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు శ్యామలను తన కొడుకు ఇంటి నుంచి గెంటేశాడు. తప్పుడు ధ్రువపత్రాలను చూపించి వృద్ధురాలి ఇంటిని కూడా లాగేసుకున్నాడు. రోడ్డున పడ్డ శ్యామల కొద్దిరోజులుగా జగిత్యాలలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటోంది. అటు తన కొడుకుపై న్యాయపోరాటం చేస్తూనే ఉంది. పోలీసులు, కోర్టుల చూట్టూ తిరిగినప్పటికీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడా శ్యామలకు న్యాయం జరగలేదు. రాజకీయ నాయకులను సంప్రదించినప్పటికీ.. ఎవరూ ఆమెకు న్యాయం చేయలేకపోయారు.

దీంతో వ్యవస్థలపై శ్యామల విసుగుచెందారు. వ్యవస్థల్లోని లోపాల్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే శ్యామల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా శ్యామల నామినేషన్ కూడా దాఖలు చేశారు. ప్రచారాలు  కూడా నిర్వహిస్తున్నారు.

తనలాగే న్యాయపోరాటం చేస్తున్న వారి తరుపున గళం వినిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్యామల చెబుతోంది. వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్ధే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఓటు వేసేందుకే ముందుకు రారు. అటువంటిది 82 ఏళ్ల వయస్సులో కూడా శ్యామల ఎన్నికల బరిలోకి దిగడంతో.. చర్చనీయాంశంగా మారింది. ఆ అంశంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. మరి శ్యామల ఎన్నికల్లో గెలుపొందుతారా?.. అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − ten =