నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన స్టేట్ హెల్త్ ఇండెక్స్ 2019-20లో వైద్య సేవలు మెరుగుపడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో, ఓవరాల్ గా ఉత్తమ వైద్య సేవలు అందించిన రాష్ట్రాల్లో 3వ స్థానంలో నిలిచిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వైద్యరంగంలో దేశంలో అగ్రస్థానం దిశగా పయనిస్తోందని చెప్పారు.
“పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల బలోపేతం నుండి పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు వరకు రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయి. మన రాష్ట్రంలో సామాన్యుడికి ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందుతోంది. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి స్పష్టం చేసింది. ఈ ఘనత డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగం సాధించిన విజయం. తెలంగాణను ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో కూడిన గ్లోబల్ హెల్త్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగుదాం” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ