తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

Telangana Government Reduced RT PCR Corona Testing Rates in Private Labs

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. అలాగే రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా పరీక్షలకు చెల్లించే ధరలను తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ల్యాబ్‌ లలో చేసే ఆర్టీపీసీఆర్‌ కరోనా పరీక్షల ధరను రూ.2,200 నుంచి రూ.850కి తగ్గించారు. అలాగే ఇంటివద్దకే వచ్చి తీసుకునే శాంపిల్‌ పరీక్ష ధరను రూ.2,800 నుంచి రూ.1,200కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం ఉపయోగించే కిట్లు మార్కెట్ లోకి పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతోనే ధరలు తగ్గింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోప్రజలకు కోవిడ్ 19 పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ