కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల చెక్కును మొగులయ్యకు అందజేసి సత్కరించారు. అలాగే తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగాకు రూ.50 వేల చెక్కు ఇచ్చి సన్మానించారు. పవన్ కళ్యాణ్ తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ నుంచి ఈ ఆర్ధిక సాయాన్ని అందించారు.
కిన్నెర కళాకారుడు మొగులయ్యకు ఆర్ధికసాయం అందించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. పవన్ కళ్యాణ్ అభినందిస్తూ గవర్నర్ ట్వీట్ చేశారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ కు అభినందనలు. మీ సహాయం స్పూర్తిదాయకమని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ