తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు (సోమవారం), ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి విచ్చేసారు. ఈ ఉదయం యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పండితులు వేదం ఆశీర్వచనం తెలిపారు. ఆ తర్వాత యాదాద్రి ప్రధానాలయాన్ని గవర్నర్ సందర్శించారు. అనంతరం బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై తోపాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత పాల్గొన్నారు. కాగా, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవటం విశేషం. సాధారణంగా.. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించటం ఆనవాయితీ. అయితే, గవర్నర్ తమిళిసైకి ప్రభుత్వం తరఫునుంచి ఆహ్వానం లేకపోవడంతో ఈ సమావేశాలకు ఆమె హాజరవలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ









































