తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో కల్లు అమ్ముకునేందుకు కల్లు గీత కార్మికులకు అనుమతి ఇస్తున్నట్టు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కల్లు గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కే.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు జారీ చేసి మెమో ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ, లాక్‌డౌన్ నిబంధనలకు అనుకగుణంగా కల్లు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వటం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నిర్ణయం వలన రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది కల్లు గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు, సుమారు 40 లక్షల మందికి పరోక్షంగా జీవనోపాధి కలుగుతుందని మంత్రి చెప్పారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో వివిధ జిల్లాలలో గీత కార్మికుల తమవృత్తిని, ఉపాదిని కోనసాగించే క్రమంలో అక్కడక్కడ కోన్ని సంఘటనలు జరిగాయన్నారు. గీత కార్మికుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గీత వృత్తిదారులు తమ వృత్తిని కోనసాగించుకోవాలని అనుమతులు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా కల్లు వృత్తి దారుల తరుపున సీఎం కేసీఆర్ కు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నీరాను ప్రోత్సహించుటకు జీవో ను ఇప్పటికే జారీ చేసామని, లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, ట్యాంక్ బండ్ పరిసరాల్లో నీరా కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరోవైపు గీత వృత్తిదారులను ప్రోత్సహించుటకు నేటి వరకు 3 కోట్ల 54 లక్షల తాటి , ఈత చేట్లను నాటటం జరిగింది. హరితహారంలో భాగంగా ఇంకా కోట్లాది తాటి, ఈత మొక్కలను ప్రజాప్రతినిధులతో కలసి ఈ వర్షాకాలంలో నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu