అక్టోబర్ 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ!

Telangana Assembly, Telangana Assembly Session, telangana assembly session dates, Telangana Assembly Sessions, Telangana Assembly Sessions 2020, Telangana CM KCR, Telangana Govt, Telangana Govt is Planning to Hold Assembly Sessions, Telangana legislature session

వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. జీహెఛ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటుగా హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విషయంపై శుక్రవారం నాడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కరోనా పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ నెలలో ఎనిమిది రోజులపాటుగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన రెవెన్యూ బిల్లు, టిఎస్ బీపాస్ బిల్లు సహా మొత్తం 12 బిల్లుల‌పై కీలకంగా చర్చించి స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu