తెలంగాణలో మరో 983 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 2, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 67,660 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 551 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.81% (< 1%) శాతంగా ఉంది.

ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1019 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 48,609 కి చేరింది. ప్రస్తుతం 18,500 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 71.8 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 273, రంగారెడ్డిలో 73, వరంగల్‌ అర్బన్‌లో 57, కరీంనగర్‌ లో 54, మేడ్చల్‌లో 48, పెద్దపల్లిలో 44, నిజామాబాద్ లో 42, సంగారెడ్డిలో 37 కేసులు నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =