రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం నాడు తుది నోటిఫికేషన్ జారీచేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్ లను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 10 గ్రామాలతో మహమ్మదాబాద్ మండలం ఏర్పాటు చేశారు. మహమ్మదాబాద్ మండలం పరిధిలో మహ్మదాబాద్, సంగాయపల్లి, ముకర్లాబాద్, లింగాయిపల్లి, నంచర్ల, జూలపల్లి, మంగంపేట్, చౌదర్‌పల్లి, అన్నారెడ్డిపల్లి, గాధిర్యాల్ వంటి 10 గ్రామాలు ఉన్నాయి.
అలాగే 14 గ్రామాలతో చౌడాపూర్ మండలం ఏర్పాటు చేయబడింది. చౌడాపూర్ మండల పరిధిలోకి చౌడాపూర్, విఠలాపూర్, మరికల్, కన్మన్ కాల్వ, మక్తా వెంకటపూర్, మల్కాపూర్, కొత్తపల్లి, పురుసంపల్లి, మొగిలపల్లి, చాకల్‌పల్లి, మండిపాల్, వీరాపూర్, అడవి వెంకటాపూర్, లింగంపల్లి గ్రామాలు వచ్చాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ