ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Eshwar Inspects Construction Works of 125 Feet Ambedkar Statue in the View of Unveiling on April 14,Minister Koppula Eshwar Inspects Construction Works,125 Feet Ambedkar Statue,Minister Koppula Inspects Inspects Ambedkar Statue,Ambedkar Statue in the View of Unveiling on April 14,Mango News,Mango News Telugu,Telangana Martyrs Memorial,Minister Koppula Inspects Ambedkar Statue Works,Telangana Ongoing Works Latest Updates,Telangana Political News And Updates,Telangana News Today,Ambedkar Statue Live News,Minister Koppula Eshwar Latest News

హైదరాబాద్‌ లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ భారీ విగ్రహం నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బుధవారం నాడు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పనులను మరోసారి పరిశీలించారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ స్వయంగా విగ్రహం నిర్మాణం పనులు పరిశీలించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరించునున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్‌ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్‌ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్‌సాగర్‌ తీరంలో భారీ విగ్రహాన్ని నిర్మించతలపెట్టినట్టు మంత్రి చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ గడువు సమీపిస్తుండటంతో నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేసి గడువు లోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ లను ఆదేశించారు. ఏప్రిల్‌ 14న అట్టహాసంగా జరిగే ఈ విగ్రహావిష్కరణకు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరవుతున్నందున ఏప్రిల్‌ 5లోగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన విగ్రహం, ల్యాండ్‌సేప్‌ ఏరియా, రాక్‌ గార్డెన్‌, లాన్స్‌లో ప్లాంటేషన్‌, పార్లమెంట్‌ ఆకృతి వచ్చే స్థంభాల సాండ్‌ స్టోన్‌ వర్స్‌, వాటర్‌ ఫౌంటైన్‌, పార్కింగ్ ఏరియా, మెయిన్‌ ఎంట్రన్స్‌ క్లాడింగ్‌ వర్స్‌, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, అధునాతన ఆడియో, వీడియో రూం తదితర అన్ని రకాల పనులకు చార్ట్‌ రూపొందించుకొని, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని, అందుకు సరిపడా మ్యాన్‌పవర్‌ను పెంచాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 3 =