వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా పేర్లను మార్చబోతున్నట్టు గత వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. 14 మండలాలు, రెండు రెవిన్యూ డివిజన్లు (హన్మకొండ, పరకాల)తో హన్మకొండ జిల్లా, 13 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు (వరంగల్, నర్సంపేట)తో వరంగల్ జిల్లా ఏర్పాటయ్యాయి.
ముందుగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్చేందుకు ప్రభుత్వం జూలై 12న ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోగా ఈ మార్పులపై తమ అభ్యంతరాలు, ఇతర సూచనలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రజలు అందించవచ్చని పేర్కొన్నారు. ఆ గడువు ముగియడంతో తాజాగా రెండు జిల్లాల నిర్మాణం/పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
హన్మకొండ జిల్లాలోని మండలాలు:
- హన్మకొండ
- కాజీపేట
- ఐనవోలు
- హసన్‌పర్తి
- వేలేరు
- ధర్మసాగర్
- ఎల్కతుర్తి
- భీమదేవరపల్లి
- కమాలాపూర్
- పరకాల
- నడికూడ
- దామెర.
- ఆత్మకూర్
- శాయంపేట
వరంగల్ జిల్లాలోని మండలాలు(13) :
- వరంగల్
- ఖిలావరంగల్
- సంగెం
- గీసుగొండ
- వర్ధన్నపేట
- పర్వతగిరి
- రాయపర్తి
- నర్సంపేట
- చెన్నారావుపేట
- నల్లబెల్లి
- దుగ్గొండి
- ఖానాపూర్
- నెక్కొండ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ