నేడు జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

Telangana CM KCR to Tour in Jharkhand Today Will Meet CM Hemanth Soren, Telangana CM KCR to Tour in Jharkhand, Telangana CM KCR To Visit Jharkhand On March 4 Will Meet CM Hemant Soren, Telangana CM KCR To Visit Jharkhand On March 4, Telangana CM KCR Will Meet CM Hemant Soren, Telangana CM KCR To Visit Jharkhand, CM KCR To Visit Jharkhand On March 4, Jharkhand, Telangana CM KCR, CM Hemant Soren, Hemant Soren, Telangana CM KCR, CM KCR, Telangana, Chief minister, Chief minister Of Telangana, KCR, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ గతంలో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తో కలిసి వారి అధికారిక నివాసంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను అందజేయనున్నారు.

చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రానికే చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. అదే సందర్భంగా అమరులైన 19 మంది ఇతర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాలకు చెందిన అమర జవాన్ల కుటుంబాలకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆర్థిక సహాయం అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =