ఎన్టీఆర్‌ జయంతి : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళుర్పించిన పలువురు ప్రముఖులు

NTR Birth Anniversary TRS TDP Political Leaders Pay Tributes at NTR Ghat, TRS TDP Political Leaders Pay Tributes at NTR Ghat, TRS Political Leaders Pay Tributes at NTR Ghat, TDP Political Leaders Pay Tributes at NTR Ghat, Political Leaders Pay Tributes at NTR Ghat, NTR Birth Anniversary, Rich tributes were paid to former Andhra Pradesh chief minister NT Rama Rao on his birth anniversary, former Andhra Pradesh chief minister NT Rama Rao, legendary actor Nandamuri Taraka Rama Rao, Taraka Ramarao, NTR Ghat News, NTR Ghat Latest News, NTR Ghat Latest Updates, NTR Ghat Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీనటులు, పలు పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి పురందరేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు. అనంతరం వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌ కు నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరావు, జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత, సహా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ నివాళులు అర్పించి, ఆయనతో తమ అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, సంచలనాలు సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేదల కోసం జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఆయన ప్రధాన మంత్రి కావాల్సింది అని, కొద్దిలో మిస్ అయిందని అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర, ఒక శక్తి అని, బడుగుబలహీన వర్గాల గురించి ఆలోచించిన మహానుభావుడు అని, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, ఈ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ జ్ఞాపకాలను, పరిపాలన దక్షతను కొత్త జనరేషన్ కు కూడా తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు ఎన్టీఆర్ ఆలోచన చేసిన విషయం అందరికి తెలిసిందేనని, అలాంటి మహనీయుడుకు ఇక్కడకొచ్చి ఘనమైన నివాళులు అర్పించామని తెలిపారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ లాంటి గొప్పవ్యక్తికి కుల, మత, పార్టీ రహితంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే సీఎం కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 14 =