తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అనుమతి దక్కించుకున్న 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఇంజనీరింగ్ సహా పలు కోర్సులతో విద్యాసంస్థలను నడుపుతుండడంతో 2020-21 విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్ లేదా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశాలు కల్పించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు:
- టెక్ మహింద్రా యూనివర్సిటీ – బహదూర్‌పల్లి – మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం
- వోక్సెన్ యూనివర్సిటీ – సదాశివ పేట – మెదక్ జిల్లా, సదాశివ పేట మండలం
- మల్లారెడ్డి యూనివర్సిటీ – మైసమ్మగూడ దూలపల్లి – మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా
- ఎస్‌ఆర్ యూనివర్సిటీ – అనంతసాగర్ – వరంగల్ జిల్లా, హసన్‌పర్తి మండలం
- అనురాగ్ యూనివర్సిటీ – వెంకటాపూర్ – మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ఘట్‌కేసర్ మండలం
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu