నల్గొండలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

IT and Industries Minister KTR, KT Rama Rao lays foundation stone for IT hub at Nalgonda, KTR lays foundation stone for Nalgonda IT hub, KTR Lays Stone For IT Hub In Nalgonda, KTR to lay foundation for IT hub in Nalgonda, Laying Foundation Stone for IT hub in Nalgonda, Mango News, Mango News Telugu, Telangana IT and Industries Minister, Telangana IT and Industries Minister KTR Lays Foundation Stone, Telangana IT and Industries Minister KTR Lays Foundation Stone for IT Hub in Nalgonda, Telangana minister KT Rama Rao lays foundation stone

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ హబ్ నిర్మాణం జరుపుకోనుండగా, ప్రభుత్వం ఇందుకోసం రూ.50 కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని టైర్ 2 పట్టణాల్లో ఐటీని ప్రోత్సహించే విధానంలో భాగంగా ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌ లు ఏర్పాటు చేయగా, తాజాగా నల్గొండలో కూడా ఐటీ హబ్‌ నిర్మాణం ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

వచ్చే 18 నెలల్లో ఈ ఐటీ హబ్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని, దాదాపు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా దీన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. మరోవైపు నల్గొండలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల నిర్మాణాలు, సమీకృత మార్కెట్ సముదాయానికి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ప్రజలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలకగా, ఆయన వెంట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fifteen =