తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లోని షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ కేంద్రాల్లో జంబో బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,31,268 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 17న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ