ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాలపై ఉత్కంఠ

2021 Andhra Pradesh Municipal Elections Results, Andhra Pradesh Municipal Elections Results, Andhra Pradesh Municipal Elections Results 2021, Andhra Pradesh Municipal Elections Results News, Andhra Pradesh Municipal Elections Results Updates, Andhra Pradesh Municipal Elections-2021 Results Live, Andhra Pradesh Municipal Elections-2021 Results Live Updates, Andhra Pradesh Municipal Elections-2021 Results Updates, AP Municipal Elections Results, Mango News, Municipal Elections Results In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులలోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 11 గంటలకల్లా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి ఫలితాలు సాయంత్రం 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ డివిజన్లు ఉండడంతో విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఫలితాలు మాత్రం కొద్దిగా ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది. ఫలితాల ప్రాథమిక సరళి బట్టి పలు డివిజన్లు, వార్డుల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు దూసుపోతున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు పెద్దస్థాయిలో విజయం సాధించగా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంచలన విజయాలను నమోదు చేస్తామని వైఎస్సార్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఏలూరులో కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో మిగిలిన 11 కార్పొరేషన్లు మరియు 70 మున్సిపాలిటీల్లో నేడు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించడం లేదని, అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత నిమిత్తం మొత్తం 20,419 పోలీసు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా కార్పొరేషన్లలో 2,204 టేబుళ్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలో 1,822 టేబుళ్లు కలిపి మొత్తం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =