తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ధరించాలని చెప్పారు. మాస్క్ లు ధరించని వారికి 1,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పారు. ప్రజలందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. హోటల్స్, పార్క్స్ ఎక్కడికి వెళ్లినా వాక్సిన్ సర్టిఫికెట్ చూపించాలని చెప్పారు. విదేశీ ప్రయాణాలు చేసేవారు కూడా తప్పనిసరిగా వాక్సిన్ సర్టిఫికెట్ దగ్గర ఉంచుకోవాలని చెప్పారు.
సౌత్ ఆఫ్రికా దేశం లో తొలిసారిగా కనుగొన్న ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఒణికిస్తోంది. డెల్టా వేరియెంట్ కన్నా ఇది 6 రేట్లు వేగంగా వ్యాప్తిచెందుతుంది. కేవలం 4 రోజుల్లో 4 దేశాల నుంచి 24 దేశాల్లోకి పాకిపోయింది. ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల బాట పడుతున్నాయి. కనుక ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విందులు, వేడుకలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ఎవరికైనా విపరీతమైన నీరసం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ