జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

తమిళనాడులో ప్రతిసంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు క్రీడపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎంతో ఎదురుచూసారు. అయితే, వారి కోరిక మేరకు ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఎంతో ఉత్కంఠ నెలకొన్న ఈ జల్లికట్టు నిర్వహణకు ముఖ్యమంత్రి స్టాలిన్ సారథ్యంలోని ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు, జల్లికట్టు కార్యక్రమ నిర్వహణపై కూడా తమిళనాడు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతించింది.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో.. పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్థ్యానికి (ఏది తక్కువ అయితే అది) అనుమతి ఇచ్చింది. పోటీదారులు, ప్రేక్షకులు తప్పనిసరిగా రెండుడోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించింది. అలాగే, పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయ ఆటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో నిర్వాహకులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =