తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై డీహెఛ్ క్లారిటీ, పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే అమలు

Director of Public Health Srinivasa Rao Gives Clarity over Night Curfew, Director of Public Health Srinivasa Rao Gives Clarity over Night Curfew Implementation, Mango News, Night Curfew Implementation, Night Curfew Implementation In Telangana, No lockdown or night curfew in Telangana, Public Health Srinivasa Rao Gives Clarity over Night Curfew, Telangana Director of Public Health Srinivasa Rao, Telangana Director of Public Health Srinivasa Rao Gives Clarity over Night Curfew Implementation in the State, Telangana Night Curfew Implementation

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెఛ్) జి.శ్రీనివాసరావు కోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేలా ప్రస్తుత కరోనా పరిస్థితులు లేవని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, అయితే పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే రాత్రి కర్ఫ్యూ విధించే అవసరం ఉంటుందని చెప్పారు. గత వారం రోజులుగా రోజుకు లక్షకు పైగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, వారంరోజుల్లో ఒక్క జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదు కాలేదన్నారు. ఇక మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అత్యల్పంగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని, జీహెచ్ఎంసీ పరిధిలో 4.26, మేడ్చల్ మల్కాజ్గిరిలో 4.22 శాతం ఉందని చెప్పారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 22 నుంచి ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే విజయవంతంగా జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలు కలిగిన 1.78 లక్షల మందికి ఐసోలేషన్ మందుల కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతుందని, ఇప్పటికీ 15-18 ఏళ్ల వారికి 59 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. అలాగే 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు కూడా అందజేసినట్టు డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here