తెలంగాణలో సచివాలయ భవనాల కూల్చివేత పక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జూలై 13, సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. సచివాలయం కూల్చివేతకు సంబంధించి పి.ఎల్.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్టే గడువు ముగియడంతో తిరిగి ఈ అంశంపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం భవనాల కూల్చివేతపై స్టే ను జూలై 15 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రభుత్వం కూడా భవనాల కూల్చివేత అనుమతులపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జూలై 15 న జరగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu