రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించండి – తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, High Court Orders Govt to Conduct up to 1 Lakh RTPCR COVID Tests Per Day, Mango News, RTPCR COVID Tests, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus News, Telangana COVID Tests, Telangana High Court, Telangana High Court Orders Govt to Conduct up to 1 Lakh RTPCR COVID Tests, Telangana High Court Orders Govt to Conduct up to 1 Lakh RTPCR COVID Tests Per Day, Telangana New Positive Cases, Telangana RTPCR COVID Tests

తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇకనుంచి రోజుకు ఒక లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపింది.

అయితే, కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం సమావేశమై చర్చించనున్నట్లు కోర్టుకు ఏజీ వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కరోనా కేసులపై విచారణ ఈనెల 25కు కోర్టు వాయిదా వేసింది. మరోవైపు కరోనా నియంత్రణలో భాగంగా హైకోర్టులో రేపటి నుంచి వర్చువల్‌గా కేసుల విచారణ జరపనున్నారు. కరోనా ప్రభావం తగ్గేవరకు ఆన్‌లైన్ ‌లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనుంది హైకోర్టు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ