గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

Ban on Immersion of PoP Ganesh Idols, Ban on Immersion of PoP Ganesh Idols in Hussain Sagar, Ganesh celebrations, ganesh chaturthi, Ganesh Chaturthi 2021, Ganesh Chaturthi Celebrations, Hussain Sagar, immersion of Ganesh idols, Mango News, Report On Ganesh Immersion, Telangana HC, Telangana High Court, Telangana High Court Orders to Ban on Immersion of PoP Ganesh Idols, Telangana High Court Orders to Ban on Immersion of PoP Ganesh Idols in Hussain Sagar

వినాయకచవితి పండుగ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ముందుగా హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం ఉదయం తీర్పును వెలువరిస్తూ, హైదరాబాద్​ నగరంలోని​ హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది.

అలాగే ట్యాంక్ బండ్ వైపు కాకుండా, పీవీ మార్గ్, సంజీవయ్య పార్కు ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసుకోవాలని, అందుకోసం హుస్సేన్‌ సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా భక్తులను భౌతిక దూరం పాటించేలా చూడాలని, నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందజేయాలని కోరింది. ఇక రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా మండపాలు వద్దని, రాత్రి 10 గంటల సమయం తర్వాత మైకులను కూడా అనుమతించొద్దని హైకోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను ప్రభుత్వం, జీహెఛ్ఎంసీ అధికారులు, సంబంధిత పోలీస్ అధికారులు తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ