తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్పు

TRSLP Changed as BRSLP in the Telangana Legislative Assembly and Council,Telangana Legislative Assembly,Telangana Legislative Council,BRSLP,TRSLP Changed as BRSLP,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Trs Party,Trs Latest News And Updates,Brs Party News And Live Updates,Election Commision Of India,Telangana Brs Party,Trs Party News

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌ గా మార్చారు. దీంతో శాసనసభలో మరియు శాసనమండలి లోనూ పార్టీ పక్షం పేరు అధికారికంగా బీఆర్ఎస్ఎల్పీగా మారింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శాసనసభ రికార్డులలో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) నుండి భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (బీఆర్ఎస్ఎల్పీ)గా మార్చాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరుతూ 2022, డిసెంబర్ 22న లేఖ ద్వారా కోరినట్టు తెలిపారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్పు అంశంలో న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం యొక్క 2022, డిసెంబర్ 8 నాటి లేఖకు అనుగుణంగా అవసరమైన చోట మరియు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ)ని ఇక నుంచి తెలంగాణ శాసనసభలో, శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (బీఆర్ఎస్ఎల్పీ)గా పరిగణిస్తామని, తదనుగుణంగా సంబంధిత రికార్డులలో అవసరమైన మార్పులను వెంటనే అమలు చేయాలని అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశించినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి గురువారం వేర్వేరుగా బులెటిన్స్ జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =