ఈ నెలలో మరో 3 జిల్లాల్లో నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Telangana CM KCR Will Inaugurate Integrated Collectorate Complexes of 3 Districts on January 12th and 18th,Telangana CM KCR,Inaugurate Integrated Collectorate Complexes,Integrated Collectorate Complexes,Mango News,Mango News Telugu,Integrated Collectorate Complex Rangareddy,Integrated District Office Complex Meaning In Telugu,Integrated District Office Complex Anthaipally,Kongara Kalan Collectorate Opening Date,Ranga Reddy Collector Office Website,New Ranga Reddy District Collector Office Address,New Collectorate Office Ranga Reddy District,Peddapalli Collector,Integrated Collectorate Complex,Integrated Collectorate Complex Sangareddy,Integrated Collectorate Siddipet,Collectorate Complex

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనవరి 12, 18వ తేదీల్లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు జిల్లాల్లో రాష్ట్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిపాలనా, ప్రజల సౌకర్యార్ధం అన్ని శాఖల అధికారులు ఒకేచోట ఉండి విధులు నిర్వర్తించేలా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు ప్రారంభమవగా, త్వరలోనే మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

“సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభంకానున్నాయి. జనవరి 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =