నేడు ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు

Telangana MP Komatireddy Venkat Reddy Gets Call From Congress High Command For The Meet Today, MP Komatireddy Venkat Reddy Gets Call From Congress High Command For The Meet Today, Komatireddy Venkat Reddy Gets Call From Congress High Command, Congress High Command, Telangana MP Komatireddy Venkat Reddy, Komatireddy Venkat Reddy, Call From Congress High Command, MP Komatireddy Venkat Reddy News, MP Komatireddy Venkat Reddy Latest News And Updates, MP Komatireddy Venkat Reddy Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మేరకు ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి కోమటిరెడ్డికి ఫోన్‌ వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినాయకత్వంతో ములాఖత్ అయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క మరియు శ్రీధర్‌ బాబు ఉన్నారు. వీరిద్దరితో కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రాతో కానీ, లేదంటే ఇతర పార్టీ ముఖ్య నేతలతో కానీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం మంగళవారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక గత కొంతకాలంగా వెంకట్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY