టమాటో ఫ్లూ వ్యాధిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు, వివరాలు ఇవే…

Centre Releases Advisory to States on Tomato Flu Disease, Centeral Governmemt Advise To States on Tomato Flu Disease, Tomato Flu Disease Latest News, Tomato Flu Disease Live Updates, Centre Issues Advisory To States On Tomato Flu, Tomato Fever, Tomato Flu, Tomato Flu Outbreak In India, Tomato Flu Symptoms And Causes, Tomato Flu Treatment, Centre Issues Guidelines on Tomato Flu, Central Government Guidelines For Tomato Flu, Mango News, Mango News Telugu,

టమాటో ఫ్లూ వ్యాధి (హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్)పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. ఈ టమాటో ఫ్లూ వ్యాధి 1-10 సంవత్సరాల వయస్సు గల చిన్న పిల్లలకు మరియు రోగనిరోధక శక్తి తగ్గిన పెద్దలకు కూడా సోకే స్వీయ-పరిమితి వ్యాధి అని పేర్కొన్నారు. అలాగే ఈ వ్యాధికి చికిత్స అందించేందుకు నిర్దిష్టమైన ఔషధం కూడా లేదని కూడా కేంద్రం వెల్లడించింది. టమాటో ఫ్లూ వ్యాధిలో ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే జ్వరం, అలసట, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నప్పటికీ, కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ మరియు చికున్‌గున్యాకు సంబంధించినది కాదని తెలిపారు.

టమాటో ఫ్లూ తొలిసారిగా మే 6, 2022 నెలలో కేరళలోని కొల్లం జిల్లాలో బయటపడిందని, కేరళలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి కనిపించిందన్నారు. కాగా జూలై 26 నాటికి 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 82 మంది పిల్లలు ఈ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు నివేదించాయని తెలిపారు. ఒడిశాలో రాష్ట్రంలో కూడా 1-9 సంవత్సరాల వయస్సు ఉన్న 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారినపడినట్టు భువనేశ్వర్ లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నివేదించిందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కేరళ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, ఒడిశా, తమిళనాడు, హర్యానా మినహా దేశంలోని ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వ్యాధి నివేదించబడలేదు. ఈ వ్యాధి ప్రాణాంతకం కానప్పటికీ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కాగా ఈ వ్యాధి లక్షణాలు మరియు ప్రభావాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. టమాటో ఫ్లూ వలన జ్వరం, నోటిలో పుండ్లు మరియు చర్మంపై దద్దుర్లు వస్తాయి. తేలికపాటి జ్వరం, పేలవమైన ఆకలి, తరచుగా గొంతు నొప్పితో ఈ వ్యాధి ప్రారంభమవుతుంది. జ్వరం వచ్చాక ఒకటి రెండ్రోజుల్లో చిన్న ఎర్రటి మచ్చలు కనిపిస్తాయని, ఇవి పొక్కులుగా తరువాత అల్సర్లుగా మారుతాయన్నారు. పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్ళు, బుగ్గల లోపల, అరచేతులు మరియు అరికాళ్ళపై వస్తాయన్నారు. పిల్లలకు , డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్ సహా ఇతర పరీక్షలు చేసి, ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ తేలకుంటే టమాటో ఫ్లూ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ఇక సరైన వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతను నిర్వహించడమే ఈ వ్యాధికి ఉత్తమ నివారణ అని పేర్కొన్నారు.

టమాటో ఫ్లూ సోకిన వ్యక్తితో పరిచయం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. టమాటో ఫ్లూ ఇన్ఫెక్షన్ పిల్లల నుంచి ఇతర పిల్లలకు లేదా పెద్దలకు వ్యాపించకుండా, ఏదైనా సంబంధిత లక్షణం కనిపించిన వెంటనే 5-7 రోజుల పాటు ఐసోలేషన్ పాటించాలని సూచించారు. అలాగే వ్యాధి సోకిన పిల్లలకు సంబంధించిన బొమ్మలు, బట్టలు, ఆహారం లేదా ఇతర వస్తువులను ఇతర పిల్లలతో పంచుకోకుండా నిరోధించాలని చెప్పారు. ఈ వ్యాధి చికిత్సల అవసరాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, తీవ్రమైన ఫలితాలపై తదుపరి పర్యవేక్షణ అవసరమని చెప్పారు.

కాగా టమాటో ఫ్లూ చికిత్సకు లేదా నివారణకు యాంటీవైరల్ మందులు లేదా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. గొంతు లేదా మలం నుండి శాంపిల్స్ సేకరించి అనారోగ్యానికి కారణమయ్యే వైరస్‌ కోసం పరీక్షించడానికి ల్యాబ్ కు పంపాలని, ఫలితాలను వచ్చేందుకు 2-4 వారాలు పట్టవచ్చుని చెప్పారు. వ్యాధి వ్యాప్తిని పరిశోధించడానికి పరీక్షలు చేయాలని, తద్వారా నివారణ చర్యలు ప్రారంభించవచ్చని రాష్ట్రాలకు సూచించారు. అయితే వ్యాధి సంభవించిన 48 గంటలలోపు గొంతు లేదా నాసోఫారింజియల్ నమూనాలను, అలాగే 48 గంటల్లోపు మల నమూనాలను కూడా సేకరించవచ్చని చెప్పారు. ముఖ్యంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలకే టమాటో ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వ్యాప్తిని నియంత్రించకపోతే, పెద్దలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + eleven =