తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 322 కరోనా కేసులు, 331 రికవరీలు నమోదు

Telangana New Covid-19 Positive Cases Update on September 1st

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 322 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 1, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,58,376 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,876 కి పెరిగింది. కొత్తగా 331 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,48,648 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 76, కరీంనగర్ లో 27, వరంగల్ అర్బన్ లో 25, రంగారెడ్డిలో 22 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 1, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,47,05,048
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,58,376
  • కొత్తగా నమోదైన కేసులు : 322
  • నమోదైన మరణాలు : 3
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,48,648
  • కరోనా రికవరీ రేటు: 98.52%
  • యాక్టీవ్ కేసులు: 5,852
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3,876
  • కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ