తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి, రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 2023, జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పాదయాత్రకు చెందిన పూర్తి రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించనున్నారు?, ఎన్ని నెలల పాటుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగనుంది? అనే విషయాలపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ‘‘యాత్ర’’ పేరుతో పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్లాలని రేవంత్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేస్తూ, విజయం దిశగా నడిపించడంలో భాగంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇటీవల పీసీసీ కమిటీలపై పార్టీలో పలువురు సీనియర్ నేతలు తిరుగుబాటు చేస్తూ, గళమెత్తిన విషయం తెలిసిందే. నేతల మధ్య ఈ విబేధాలు తొలిగిపోయి, రేవంత్ పాదయాత్రకు సీనియర్ నేతలు మద్ధతు ఇస్తారా?, యాత్రలో పాల్గొంటారా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE