టీఎస్ ఎల్‌పీ సెట్-2021 నోటిఫికేషన్ విడుదల

LPCET 2021 Notification, Mango News, Telangana LPCET, Telangana LPCET Online Apply 2021 Exam Dates, TS LPCET 2021, TS LPCET Application Form, TS LPCET Application Form 2021, TS LPCET Notification, TS LPCET-2021 Notification, TS LPCET-2021 Notification Released

ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో (డిప్లొమా కోర్సులు) ప్రవేశం పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎల్‌పీ సెట్ నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఎల్‌పీ సెట్-20121 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎల్‌పీ సెట్‌ దరఖాస్తులు అమ్మకం జూన్ 11 నుంచి ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా జూన్ 21 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 22 వరకు దరఖాస్తులను అందించనున్నారు. దరఖాస్తుల సమర్పించడానికి జూన్ 23 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఇక ఎల్‌పీ సెట్‌-2021 పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత ప్రకటిస్తామని, పరీక్షా నిర్వహణ తేదీ నుంచి 10 రోజుల లోపల ఫలితాల వెల్లడి ఉంటుందని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. అప్లికేషన్ డౌన్ లోడ్ సహా ఇతర వివరాలను sbtet.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here