తెలంగాణ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మంచిర్యాల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న స్వరూపారాణిని జగిత్యాలకు బదిలీ చేశారు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను మంచిర్యాలకు బదిలీ చేశారు. అలాగే మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ప్రసన్నరాణిని మరియు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా శరత్ చంద్రను నియమించారు. మరోవైపు ఇప్పటివరకు మహబూబాబాద్, వికారాబాద్ లలో విధులు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్లను మున్సిపల్ డైరెక్టరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ