ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కార్మికులకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021-22కి గాను కంపెనీ లాభాల వాటాలో 368 కోట్లను 30 శాతం బోనస్‌గా ఆయన కార్మికులకు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్. అయితే సీఎం ప్రకటించిన దసరా బోనస్ అక్టోబర్ 1వ తేదీన చెల్లిస్తామని శ్రీధర్ వెల్లడించారు. కాగా 2021-22లో సింగరేణి సంస్థకు వచ్చిన మొత్తం టర్నోవర్ రూ. 26,607 కోట్లు అని, దీనిలో లాభం రూ. 1,227 కోట్లు అని తెలిపారు. అలాగే ఈ లాభాల్లోనుంచి బోనస్‌గా సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు కార్మికులకు రూ. 368 కోట్లు కేటాయిస్తున్నట్లు శ్రీధర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY