తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. కాగా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. 2023, జనవరి 18వ తేదీన నూతన సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలనీ, అలాగే అప్పుడు నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూత్రపాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. సచివాలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ముందుగా 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి, తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో ఆలోపుగానే మిగిలిన పనులు పూర్తి చేయాలని, పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ అధికారులు మరియు సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే సచివాలయ ప్రారంభోత్సవం, సంబంధిత కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేలా అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ పలుమార్లు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ అనేక మార్లు స్వయంగా పరిశీలించి, నిశితంగా గమనించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE