ఈసారి ‘కంటి వెలుగు-2’ ద్వారా రాష్ట్రంలో కోటిన్నర మందికి పరీక్షలు, 55లక్షల మందికి కళ్లద్దాలు అందిస్తాం – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Held High Level Review Meet on Kanti Velugu-2 Programme in Telangana,Minister Harish Rao,Kanti Velugu Programme,Kanti Velugu-2 Programme,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Telangana,Telangana Kanti Velugu Programme,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

ఈసారి ‘కంటి వెలుగు-2’ ద్వారా రాష్ట్రంలో కోటిన్నర మందికి పరీక్షలు, 55లక్షల మందికి కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. మంగళవారం ఆయన హైదరాబాద్‌ లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, క్వాలిటీ టీమ్స్‌ మరియు ప్రోగ్రామ్‌ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరి కళ్ళల్లో వెలుగులు నింపేందుకు ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. మొదటివిడతలో దాదాపు 1.54కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని, అలాగే దాదాపు 50లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చామని, అలాగే అది అప్పట్లో ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్‌ పోగ్రామ్‌’గా నిలిచిందని గుర్తుచేశారు.

ఇక ఇప్పుడు సీఎం కేసీఆర్‌ మరోసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దీనికోసం ఆయన రూ.200కోట్లు కేటాయించారని హరీష్ రావు తెలిపారు. ఈ ‘కంటి వెలుగు-2’ ద్వారా ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని, 55లక్షల మందికి ప్రభుత్వ పరంగా కళ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వీటిలో 30లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ మరియు మరో 25లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్‌ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కావున దీనిని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి అధికారులతో పాటు ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమ నిర్వహణ కోసం తొలివిడతలో 827 బృందాలు పని చేశాయని, ఇప్పుడు 1500 బృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. అలాగే దీనిని 100 పని దినాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తే ఇది సాధ్యమేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =