బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం.. ఇండియాతో నూతన వాణిజ్య ఒప్పందానికి అంగీకారం

UK Prime Minister Rishi Sunak Announces Delivering New Free Trade Deal with India Soon,UK Prime Minister Rishi Sunak,UK Rishi Sunak,Rishi Sunak UK Prime Minister,Mango News,Mango News Telugu,New Free Trade Deal India,New Free Trade Deal,Rishi Sunak,UK Prime Minister Rishi Sunak News And Updates,Rishi Sunak Latest News And Updates,Prime Minister Rishi Sunak News And Live Updates, Indian PM Narendra Modi,Indian Prime Minister Modi,PM Modi

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాతో నూతన వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాంగ విధానంపై మొదటిసారిగా లార్డ్ మేయర్ ఆఫ్ లండన్ బాంక్వెట్‌లో జరిగిన కార్యక్రమంలో సోమవారం రాత్రి ప్రసంగిస్తూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నామని, ఈ క్రమంలో భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్టీఏ) యూకే కట్టుబడి ఉందని సునాక్ పునరుద్ఘాటించారు. నేను రాజకీయాల్లోకి రాకముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాను. 2050 నాటికి, ఇండో-పసిఫిక్ ఐరోపా మరియు ఉత్తర అమెరికా నుండి కేవలం పావు వంతుతో పోలిస్తే ప్రపంచ వృద్ధిలో సగానికి పైగా అందజేస్తుంది. అందుకే మేము భారతదేశంతో ట్రాన్స్-పసిఫిక్ వాణిజ్య ఒప్పందం ద్వారా సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం అని సునాక్ వివరించారు.

అలాగే ఇండియాతో పాటు ఇండోనేషియాతో కూడా స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని రిషి సునాక్ వెల్లడించారు. ఇక అదే సమయంలో చైనా విషయానికి వస్తే, బ్రిటన్-చైనా మధ్య స్వర్ణయుగ సంబంధాలు ముగిశాయని స్పష్టం చేశారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని, దాని నిరంకుశ పాలన పట్ల బ్రిటన్ వైఖరిని తెలియజేయాల్సిన సమయమిదేనని తేల్చి చెప్పారు. బ్రిటన్ యొక్క గొప్ప సాంస్కృతిక విలువలు, విస్తృత ప్రయోజనాలకు చైనా వ్యూహాత్మక సవాల్ విసురుతోందని, అందుకే తాము ఈ వైఖరిని ఎంచుకున్నామని రిషి సునాక్ తెలిపారు. ఇక ఇటీవలి సంవత్సరాలలో మేము హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉక్రెయిన్ నుండి వేలాది మంది ప్రజలను స్వాగతించామని, అలాగే యూకే విలువలకు అండగా నిలుస్తుందని, కేవలం మాటలతో కాకుండా చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =